: పర్వేజ్ ముషారఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్


2013లో పాక్ లోని లాల్ మసీదుపై మిలటరీ దాడి జరిగిన ఘటనలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జూలై 24లోగా ముషారఫ్ ను అరెస్ట్ చేసి తనముందు ప్రవేశపెట్టాలని అదనపు సెషన్స్ జడ్జి కమ్రాన్ బస్రాత్ ముఫ్తీ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆయన కోర్టుకు రాకుంటే, గతంలో ఆయన కోర్టుకిచ్చిన సెక్యూరిటీ బాండ్లను జప్తు చేస్తామని హెచ్చరించారు. దీంతో పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ ను న్యాయమూర్తి తిరస్కరించారు. కాగా, 1999 నుంచి 2008 మధ్య పాక్ ను పాలించిన ముషారఫ్ పై ప్రస్తుతం ఎన్నో కేసులు విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News