: మోదీ నాయకత్వంలో పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు మెరుగయ్యాయి: జైట్లీ
ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాల కారణంగా పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు మెరుగయ్యాయని ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కేంద్రం పాకిస్థాన్ తో సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై ఆసక్తిగా ఉందని, చైనా నాయకత్వంతో ప్రధాని అద్భుతమైన సంబంధాలను అభివృద్ధి చేశారని కితాబిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న జైట్లీ న్యూయార్క్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు. చైనాతో సరిహద్దు సమస్యతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. చైనాతో వాణిజ్య లావాదేవీలు సజావుగానే సాగుతున్నాయని వివరించారు.