: గేల్ కొడితే డ్రోన్ బద్దలైంది... కేపీ షాట్ కొద్దిలో తప్పిపోయింది!
ఐపీఎల్ స్ఫూర్తితో ఆరంభమైన కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) క్రమంగా ప్రజాదరణ పొందుతోంది. తాజా సీజన్ త్వరలోనే ఆరంభం కానుంది. ప్రస్తుతం లీగ్ ప్రమోషన్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో భారీ హిట్టర్లు క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్ బ్యాట్లతో పోటీ పడ్డారు. పోటీ ఏంటంటే... గాల్లో నిలిచిన ఓ డ్రోన్ ను ఎవరు కొట్టిన షాట్ తాకుతుందో వారే విన్నర్! ఈ చాలెంజ్ లో గేల్ సంధించిన ఓ భారీ షాట్ డ్రోన్ ను తుత్తునియలు చేసింది. కేపీ కొట్టిన షాట్ కొద్దిలో తప్పిపోయింది. బంతి డ్రోన్ పక్క నుంచి దూసుకెళ్లింది. ఇక, మరో చాలెంజ్ లోనూ కరీబియన్ యోధుడే నెగ్గాడు. ఎవరు భారీ సిక్స్ కొడతారన్న చాలెంజ్ లో గేల్ కొట్టిన సిక్స్ 119 మీటర్ల దూరం వెళ్లగా, కేపీ కొట్టిన సిక్స్ 117 మీటర్ల దూరం వెళ్లింది.