: గవర్నర్ ను ఏపీ మంత్రులు కించపరచలేదు... ఆయనే మంత్రులను అవమానించారు: మంత్రి రావెల
ఏపీ మంత్రులు గవర్నర్ నరసింహన్ ను కించపరిచేలా మాట్లాడారని, దీనిపై గవర్నర్ మనస్తాపానికి గురయ్యారని వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్పందించారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రులు ఎవరూ గవర్నర్ ను కించపరిచేలా మాట్లాడలేదని స్పషం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, తమ బాధలను చెప్పుకోవడానికి వెళ్లిన మంత్రులనే గవర్నర్ కించపరిచారని... అవమానపరిచేలా వ్యవహరించారని ఆరోపించారు. వేలు చూపించి మరీ ఏపీ మంత్రులను అవమానించారని చెప్పారు. అయినప్పటికీ, తమ మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ కూడా చెప్పారని గుర్తు చేశారు.