: ఏసీబీ కోర్టుకు చేరిన స్టీఫెన్ సన్ వాంగ్మూలం.. వేగం పుంజుకోనున్న దర్యాప్తు
ఓటుకు నోటు కేసులో ఫిర్యాదుదారుడు, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ వాంగ్మూలం కొద్దిసేపటి క్రితం ఈ కేసు విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానానికి చేరింది. హైదరాబాదు మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్... స్టీఫెన్ సన్ తో పాటు ఆయన కుమార్తె జెస్సీకా, ఫ్లాట్ ఓనర్ మార్క్ టేలర్ ల వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముగ్గురి వాంగ్మూలాలను సీల్డ్ కవర్ లో పెట్టిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఏసీబీ న్యాయస్థానానికి పంపించారు. స్టీఫెన్ సన్ కీలక విషయాలు చెప్పారని భావిస్తున్న నేపథ్యంలో ఈ వాంగ్మూలం కాపీ చేతికందితే కేసులో ఏసీబీ దర్యాప్తు మరింత వేగం పుంజుకోనుంది.