: గవర్నర్ గురించి నోరు జారద్దు: సహచరులకు బాబు క్లాస్


గవర్నర్ గురించి ఎవరూ వివాదాస్పద వ్యాఖ్యలు, నిందారోపణలు చేయవద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ 'చేతకాని వాడని', 'గంగిరెద్దని', 'పదవి నుంచి దిగిపోవాలని' పలువురు ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో బాబు కల్పించుకున్నారు. గవర్నర్ పై ఎటువంటి వ్యాఖ్యలూ చేయరాదని మంత్రి వర్గ సహచరులు, పార్టీ శ్రేణులు, అధికార ప్రతినిధులకు ఆయన క్లాస్ పీకారు. అనవసర వ్యాఖ్యలు చేసి వివాదాలు కొనితెచ్చుకోవద్దని సూచించారు. కాగా, గత పది రోజుల వ్యవధిలో గవర్నర్ నరసింహన్ పై ఏపీ మంత్రులు గంటా, అచ్చెన్నాయుడు, శిద్ధా తదితరులు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News