: ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనను నిర్మిస్తున్న చైనా


అగ్రరాజ్యం అమెరికాతో పోటీ పడుతున్న చైనా అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించేందుకు అనునిత్యం ప్రయత్నిస్తోంది. తాజాగా, ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనను నిర్మించే పనిలో పడింది. జింయాంగ్జియాజ్ అనే ప్రాంతంలో ఉన్న గ్రాండ్ కాన్యన్ లో 380 మీటర్ల పొడవైన గాజు వంతెనను నిర్మిస్తున్నారు. ఈ గాజు వంతెనపై నుంచి దాదాపు 300 మీటర్ల లోతున ఉన్న ప్రదేశాన్ని వీక్షించవచ్చు. వచ్చే అక్టోబర్ నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తికానుంది. ఈ వంతెనపై ఒకేసారి 800 మంది వెళ్లవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే తియాన్మెన్ పర్వతం వద్ద గాజు వంతెన ఉన్నప్పటికీ... ఇప్పుడు నిర్మిస్తున్నది అతి పొడవైన వంతెన అవుతుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News