: టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా మాది శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం
తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీగా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ తన కార్యాలయంలో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పద్నాలుగు ఏళ్లుగా టీఆర్ఎస్ లో కొనసాగుతున్నానని, ఏనాడు పదవులు ఆశించలేదని అనంతరం మాదిరెడ్డి అన్నారు. పార్టీకోసం పనిచేసే వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని, అందుకు తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.