: తెలంగాణ ప్రభుత్వంపై పెత్తనం చేస్తామంటే కుదరదు: శ్రీనివాస్ గౌడ్


టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదు జూబ్లీ హాల్ లో మీడియాతో మాట్లాడారు. రాజధాని లేదు, నిర్మించుకుంటాం అంటేనే హైదరాబాదులో పదేళ్లు ఉండేందుకు అంగీకరించామని, అలాంటిది తెలంగాణ ప్రభుత్వంపైనా, హైదరాబాదుపైనా పెత్తనం చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడినా చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. సెక్షన్-8 పేరుతో కుట్రలు చేయడం తగదని అన్నారు. అవసరమైతే మరో ఉద్యమానికి వెనుకాడబోమని హెచ్చరించారు. చేసిన తప్పు అంగీకరిస్తే మర్యాదగా ఉంటుందని చంద్రబాబుకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News