: వికెట్ కీపర్ అవతారం ఎత్తిన కోహ్లీ!


స్టార్ బ్యాట్స్ మేన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ అవతారం ఎత్తాడు. ఈ ముచ్చట నిన్నటి మీర్పూర్ వన్డేలో దర్శనమిచ్చింది. 44వ ఓవర్ లో కోహ్లీ కీపింగ్ గ్లౌవ్స్ ధరించాడు. ఓ ఓవర్ పాటు కీపింగ్ చేశాడు. 45వ ఓవర్ లో తిరిగి ధోనీ రావడంతో కోహ్లీ ఫీల్డింగ్ లోకి మారాడు. ఓ ఓవర్ పాటు ధోనీ మైదానం వీడటంతోనే కోహ్లీ అతడి బాధ్యతలను నిర్వర్తించాడు. మరి భవిష్యత్తులో ధోనీలా అటు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ... ఇటు వికెట్ కీపింగ్ కూడా చేస్తాడేమో!

  • Loading...

More Telugu News