: రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యం, సుదీర్ఘ జీవితం ఆ దేవుడు ఆయనకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా" అని మోదీ ట్వీట్ చేశారు. ఇందుకు వెంటనే ట్విట్టర్ లో స్పందించిన రాహుల్, తనకు శుభాకాంక్షలు చెప్పినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాహుల్ ఈరోజు 45వ పడిలోకి అడుగుపెడుతున్నారు. చాలా సంవత్సరాల తరువాత తన పుట్టినరోజు నాడు ఆయన ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు తమ యువనేత పుట్టినరోజును జరిపేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు సన్నాహాలు చేస్తున్నారు. రాజధానిలో రాహుల్ నివాసం 12 తుగ్లక్ లేన్ లో 45 కేజీల కేక్ కట్ చేయించనున్నారు.