: రూ. 10 విలువైన వాటా రూ. 96 వేలట... వసుంధర కుమారుడి కంపెనీకి లలిత్ మోదీ 'ప్రయోజనం'!


ఒకప్పటి ఐపీఎల్ హీరో, ఆపై ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేల మధ్య బంధంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. వసుంధర కుమారుడు దుష్యంత్, మోదీల మధ్య అక్రమ వ్యాపార లావాదేవీలు జరిగాయని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలో వెల్లడైంది. దుష్యంత్ కు చెందిన నియాంత్ హెరిటేజ్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మోదీ 6 వేల వాటాలను నమ్మశక్యం కాని ధరకు కొనుగోలు చేశాడని ఈడీ కనుగొంది. ఒక్కొక్కటి పది రూపాయల విలువైన వాటాలకు రూ. 65 వేల చొప్పున లలిత్ మోదీ చెల్లించారని, ఈ లావాదేవీలో రూ. 39 కోట్లు చేతులు మారాయని గుర్తించింది. అంతకుముందు అదే సంస్థలో ఒక్కో వాటాకు రూ. 96 వేల చొప్పున చెల్లించి ఆయన కొనుగోలు చేశాడని, మోదీకి చెందిన ఓ సంస్థ దుష్యంత్ కంపెనీకి రూ. 11 కోట్ల అన్ సెక్యూర్డ్ రుణాన్ని ఇచ్చిందని కూడా ఈడీ అధికారులు వెల్లడించారు. కాగా, దుష్యంత్ మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలని, తమ లావాదేవీలన్నీ పూర్తి చట్టపరమైనవేనని ఓ ప్రకటన వెలువరించారు.

  • Loading...

More Telugu News