: వంతెన నిర్మాణానికి ఇంకా ఎంత టైం కావాలి?: గామన్ ఇండియాపై చంద్రబాబు ఆగ్రహం


పుష్కరాల సమయం దగ్గర పడుతున్నప్పటికీ, గోదావరి నదిపై నిర్మిస్తున్న నాలుగో వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో చంద్రబాబునాయుడికి కోపం వచ్చింది. దీంతో వంతెన నిర్మాణ కాంట్రాక్టును పొందిన గామన్ ఇండియాపై ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పుష్కర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన బాబు, ఆ సమావేశానికి వచ్చిన గామన్ ఇండియా, గోదావరి ప్రాజెక్టు ఇన్ చార్జ్ నాగేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ముందుగా నిర్ణయించిన సమయం అయిపోయిందని గుర్తు చేసిన బాబు, ఇప్పటికే పలు మార్లు గడువు పొడిగించామని, ఇంకా ఎంత సమయం కావాలని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో పది రోజుల్లోగా వంతెన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News