: పవన్ కల్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు... ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు


టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాటల దాడి చేశారు. ట్విట్టర్ వేదికగా కొద్దిసేపటి క్రితం వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పాలకుల్ని ప్రశ్నిస్తాననే వాడు ప్రశ్నించనప్పుడు, కళ్యాణం కోరుకునే జనాలకి పెళ్లెప్పుడు?’’, ‘‘ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కల్యాణానికి ద్రోహం..ఇది కళ్యాణ ద్రోహం’’ అని వర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రజల పక్షాన పాలకులను ప్రశ్నించేందుకు జనసేనను ఏర్పాటు చేస్తున్నానని గతంలో పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. నాటి ఆయన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, వర్మ తాజాగా ఈ ట్వీట్లు పోస్ట్ చేశారు. మరి దీనిపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News