: కోడె మొక్కు తీర్చుకున్న కవిత... గంట మొక్కు చెల్లించిన కేసీఆర్ సతీమణి
నిజామాబాదు ఎంపీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత నిన్న వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో కోడె మొక్కు తీర్చుకున్నారు. నిన్న రాజన్న ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా ఆలయానికి వచ్చారు. భర్త, పిల్లలతో కలిసి కవిత కూడా రాజన్న ఆలయానికి వచ్చారు. భర్తతో కలిసి స్వామి వారికి ఆమె కోడెదూడను సమర్పించుకున్నారు. ఇక కవిత తల్లి, సీఎం కేసీఆర్ సతీమణి శోభ శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి గంట మొక్కు చెల్లించుకున్నారు.