: హైదరాబాదులోని సీమాంధ్రులకు ఆంధ్రా నీరేనట!


వినడానికి కాస్త విడ్డూరంగానే ఉన్నా, రాబోయే కాలంలో ఇది కార్యరూపం దాల్చనుంది. ఏపీలో ఉన్న నీటిని హైదరాబాదులోని సీమాంధ్రులకు ఎలా అందిస్తారనేగా, మీ డౌటు? ప్రస్తుతం హైదరాబాదు నగరవాసుల దాహార్తిని మంజీర నదితో పాటు కృష్ణా జలాలు కూడా తీరుస్తున్నాయి. నిన్న కృష్ణా జలాల పంపకాలపై కృష్ణా నీటి యాజమాన్య బోర్డు సుదీర్ఘంగా భేటీ నిర్వహించింది. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాలకు నీటి వాటాలను బోర్డు ప్రకటించింది. అయితే హైదరాబాదులో సగం మంది సీమాంధ్రులున్నారని వాదించిన తెలంగాణ ప్రభుత్వం, సగం నీటిని ఏపీ కోటా నుంచే హైదరాబాదుకు తరలించాలని కోరింది. ఈ మేరకు ఏపీ అధికారుల సమక్షంలోనే తన కొత్త ప్రతిపాదనను బోర్డు ముందుంచింది. అయితే తమ రాష్ట్రంలో కరవు జిల్లాలున్నాయని, వాటికి నీటిని విడుదల చేయాల్సి ఉందని ఏపీ వాదించింది. దీనిపై తర్జనభర్జన పడ్డ ఏపీ అధికారులు హైదరాబాదులోని సీమాంధ్రుల తాగు నీటి అవసరాల కోసం మొత్తం వినియోగమయ్యే నీటిలో సగం వాటాను తన కోటా నుంచి ఇచ్చేందుకు సిద్ధమేనని ప్రకటించారుః.

  • Loading...

More Telugu News