: ముంబయిలో రాత్రి నుంచి భారీ వర్షం... స్తంభించిన జనజీవనం
నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావం పలు రాష్ట్రాల్లో బలంగా కనిపిస్తోంది. ముంబయిలో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. రైల్వే ట్రాక్ లు నీటమునిగాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. లోకల్ రైళ్లు నిలిపివేశారు. స్థానిక రవాణా వ్యవస్థకు అంతరాయం కలగడంతో జనజీవనం స్తంభించిపోయింది. అదనపు బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.