: ఏసీబీ విచారణకు సండ్ర వచ్చేనా?...నేటీ సాయంత్రంతో ముగియనున్న నోటీసుల గడువు


ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేటి సాయంత్రం 5 గంటల్లోగా ఏసీబీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు మొన్న ఆయన నివాసం గోడకు ఏసీబీ అధికారులు నోటీసులు అతికించి వచ్చారు. అయితే ఏసీబీ నోటీసులు జారీ అయినప్పటి నుంచి సండ్ర పత్తా లేకుండా పోయారు. నేటి సాయంత్రం కూడా ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తాను, సోమవారం మీ ముందుకు వస్తానని ఏసీబీకి సండ్ర లేఖ రాయనున్నట్లు సమాచారం. మరోవైపు నేటి సాయంత్రంలోగా సండ్ర విచారణకు హాజరుకాని పక్షంలో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను జారీ చేసేందుకు కూడా ఏసీబీ సన్నాహాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News