: అందరూ పత్తిత్తులే: చర్చా కార్యక్రమంలో ఆనం
కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి టీవీ9 చర్చా కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ నరసింహన్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తావనకు రాగా, ఆనం స్పందిస్తూ... గవర్నర్ ను దృతరాష్ట్రుడు అనడం సరికాదన్నారు. దృతరాష్ట్రుడితో పోల్చడం అంటే గుడ్డివాడని అన్నట్టే అని అన్నారు. ఇక, రేవంత్ రెడ్డి వ్యవహారంపైనా ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ అన్ని పార్టీలు డబ్బులిస్తాయని, అది తెలిసిన విషయమేనని అన్నారు. అందరూ పత్తిత్తులేనని, అయితే, దొరికారు కాబట్టి మీరు దొంగలేనని అక్కడే ఉన్న టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావుతో అన్నారు. దీనికి జూపూడి స్పందిస్తూ... మీరు కూడా డబ్బులిచ్చినట్టు అంగీకరించారు కదా? అని పేర్కొనగా, 'దొరక్కపోతే ఎవరైనా దొరలే' అంటూ ఆనం చర్చను కొనసాగించారు.