: ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో బాలకృష్ణ సందడి


నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాదులోని ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో సందడి చేశారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆయన గురువారం కార్యాలయానికి విచ్చేశారు. ఇటీవలే ఆయన లైసెన్స్ కాలపరిమితి ముగిసింది. దీంతో, కార్యాలయానికి వచ్చి ఫొటో దిగడంతోపాటు, డిజిటల్ సైన్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్యకు అక్కడి జేటీసీ రఘునాథ్ సహకరించారు.

  • Loading...

More Telugu News