: సెక్షన్ 8 అమలు కోసం కేంద్రానికి గవర్నర్ సిఫారసు
ఓటుకు నోటు వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిన్నటిదాకా మాటల యుద్ధం సాగింది. తాజాగా ఈ పంచాయతీ కేంద్ర ప్రభుత్వం చెంతకు చేరింది. కేంద్రం వద్దకు వెళుతున్న ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు ఎవరికి వారు తమ వాదన సరైనదంటే, కాదు తమ వాదనే సరైనదంటూ వాదులాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో జోక్యం చేసుకున్న కేంద్రం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో మాట్లాడింది. దీంతో నిన్నటికా దాకా చడీచప్పుడు లేకుండా కూర్చున్న నరసింహన్ కేంద్రం మాటతో ఒక్కసారిగా కదిలారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని, ఈ మేరకు అనుమతివ్వండని ఆయన కేంద్రానికి ప్రతిపాదించారు. గవర్నర్ నుంచి ప్రతిపాదనను అందుకున్న కేంద్రం, దీనిపై తన అభిప్రాయం చెప్పాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని కోరింది. నేడో, రేపో రోహత్గీ కూడా తన అభిప్రాయాన్ని కేంద్రానికి పంపనున్నారు.