: ధోనీ దారికి అడ్డం వచ్చి గాయపడ్డాడు!
మిర్పూర్ లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. బంగ్లాదేశ్ విసిరిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ టాపార్డర్ కు బంగ్లాదేశ్ బౌలర్లు తమ పదును రుచిచూపించారు. జట్టును గెలిపించేందుకు రంగంలోకి దిగిన కెప్టెన్ ధోనీ విఫల ప్రయత్నం చేశాడు. కాగా, ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి ధోనీ పరుగు తీసే క్రమంలో బౌలర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ అడ్డుగా వచ్చాడు. బాగా బలిష్టంగా ఉండే ధోనీ తనదారికి అడ్డం వచ్చిన ఆ కుర్ర బౌలర్ ను నిర్దాక్షిణ్యంగా నెట్టివేశాడు. దాంతో, కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న ఆ లెఫ్టార్మ్ పేసర్ గాయపడి మైదానం వీడాల్సి వచ్చింది. అనంతరం ఆ ఓవర్ ను నాసిర్ హుస్సేన్ పూర్తి చేశాడు. ప్రథమ చికిత్స అనంతరం మైదానంలో అడుగుపెట్టిన ఈ 19 ఏళ్ల బౌలర్ మొత్తమ్మీద 5 వికెట్లతో సత్తా చాటడం విశేషం.