: చంద్రబాబు దరఖాస్తును పెండింగ్ లో పెట్టలేదు... తిప్పి పంపాం: సోమేశ్ కుమార్
హైదరాబాదులో చంద్రబాబు గృహ నిర్మాణ అనుమతికి, ఏపీ సచివాలయ ఆస్తి పన్ను బకాయిలకు సంబంధం లేదంటున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్. సచివాలయానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించనందునే చంద్రబాబు గృహనిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతి ఇవ్వలేదన్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. గృహనిర్మాణం కోసం చంద్రబాబు సమర్పించిన దరఖాస్తు నిబంధనలకు అనుగుణంగా లేనందునే అనుమతి నిరాకరించామని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. పైగా ఆ దరఖాస్తు పెండింగ్ లో పెట్టామని అంటున్నారని, అది అవాస్తవమని తెలిపారు. తాము చంద్రబాబు దరఖాస్తును కొన్ని రోజుల్లోనే తిప్పి పంపామని వెల్లడించారు. కాగా, ఈ విషయమై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సోమేశ్ కుమార్ ఐఏఎస్ ఆఫీసరా? టీఆర్ఎస్ ఆఫీసరా? అంటూ దుయ్యబట్టారు. మదమెక్కి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు.