: గవర్నర్ పై వ్యాఖ్యలను వెనక్కితీసుకుంటున్నా: అచ్చెన్నాయుడు
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తెలంగాణ సర్కారు చెప్పిందే వేదంలా గవర్నర్ 'గంగిరెద్దు'లా తలూపుతున్నారంటూ బుధవారం మీడియా ముందు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అయితే, తాను గవర్నర్ పై వ్యక్తిగత ద్వేషంతో ఆ మాట అనలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను చుట్టుముట్టిన కష్టాల నేపథ్యంలోనే ఆవేశంతో వ్యాఖ్యానించానని తెలిపారు. ఎవరూ అపార్థం చేసుకోరాదని అన్నారు.