: అరుదైన తెల్ల పులి పిల్లలకు నామకరణం చేసిన జయలలిత


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జంతు ప్రేమికురాలు. తాజాగా, వాండలూరు జంతు ప్రదర్శనశాలలో ఆకాంక్ష అనే అరుదైన తెల్ల పులి ప్రసవించింది. దానికి పుట్టిన నాలుగు పిల్లలకు జయలలిత నామకరణం చేశారు. ప్రీత, సంగీత, అనిత, సునీత అని వాటికి పేర్లు పెట్టారు. పురచ్చితలైవి పులి పిల్లలకు నామకరణం చేయడం ఇదే తొలిసారి కాదు. 2013లో పుట్టిన ఏడు పులి పిల్లలకు ఆమే పేర్లు పెట్టారు. అంతేగాదు, గతేడాది ఐదు పులిపిల్లలకు నామకరణం చేసిందీ 'అమ్మే'! ఈ మేరకు ప్రభుత్వాధికారులు వివరాలు తెలిపారు.

  • Loading...

More Telugu News