: కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ అయిన ఏపీ సీఎస్


కేంద్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి గోయల్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కాసేపటి కిందట భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాదులో సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం, టీడీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ తదితర అంశాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి కృష్ణారావు తీసుకెళ్లారు. ఏపీ సీఎస్ ఈ ఉదయం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం ఏపీ డీజీపీ రాముడు కూడా ఢిల్లీ వెళ్తున్నారు.

  • Loading...

More Telugu News