: స్మృతి ఇరానీ సర్టిఫికెట్లను కూడా పరిశీలించాలి: ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోదీ
ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఇబ్బందులు కలిగించేలా ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఢిల్లీ న్యాయశాఖ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ ను నకిలీ లా డిగ్రీ పట్టా కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రహ్లాద్ మోదీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని టార్గెట్ చేశారు. ఆమె డిగ్రీపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయని... కాబట్టి, ఆమె విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను కూడా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.