: జెరూసలేం మత్తయ్య అరెస్టుపై హైకోర్టు స్టే
ఓటుకు నోటు కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యకు హైకోర్టులో తాత్కాలిక ఊరట కలిగింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా కోర్టు స్టే విధించింది. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, కేసు నుంచి తన పేరు తొలగించాలంటూ మత్తయ్య ఈ మధ్యాహ్నం మత్తయ్య పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మిగతా ఇద్దరు నిందితుల బెయిల్ పై కూడా హైకోర్టు అదేరోజు విచారణ చేయనున్న సంగతి తెలిసిందే.