: ఆ రెండు పార్టీలు దొంగల పార్టీలే: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడితే... టీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎలా ఆకర్షిస్తుందని ప్రశ్నించారు. 'టీడీపీ, టీఆర్ఎస్ రెండు కూడా దొంగల పార్టీలే' అని కామెంట్ చేశారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, వ్యతిరేకత ప్రారంభమయిందని చెప్పారు. సామాజిక న్యాయాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు.