: నోటీసులు ఇవ్వాలనుకుంటే గవర్నరు కూడా అడ్డుకోలేరు: మాజీ డీజీపీ దినేష్ రెడ్డి
స్పష్టమైన ఆధారాలున్నాయని భావిస్తే అవినీతి నిరోధక శాఖ ఎవరికైనా నోటీసులు ఇవ్వవచ్చని, వీటికి ఎవరి అనుమతీ అక్కర్లేదని, చట్ట పరిధిలోని అంశం కాబట్టి గవర్నరు కూడా అడ్డుకోలేరని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. నోటీసులు ఇవ్వడానికి నిందితుడి హోదాతో సంబంధం ఉండదని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రం సుమోటోగా జోక్యం చేసుకోబోదని, నోటీసులు ఎవరికి, ఎప్పుడు ఇవ్వాలన్న అంశం తెలంగాణ ఏసీబీ పరిధిలోని అంశమని దినేష్ తెలిపారు. ఉమ్మడి రాజధానిలో ప్రజల హక్కులకు, ఆస్తులకు భంగం వాటిల్లినప్పుడే గవర్నర్ జోక్యానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులపై దాడులు జరిగితే గవర్నర్ జోక్యం చేసుకోవచ్చని, అంతేతప్ప శాంతిభద్రతలు పూర్తిగా ఆయన పరిధిలో ఉండవని స్పష్టం చేశారు.