: డాలర్ పతనంతో దూరమవుతున్న బంగారం!


అమెరికా డాలర్ పతనం ప్రభావంతో విలువైన లోహాల ధరలు మరింతగా పెరిగాయి. గురువారం నాటి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ సెషన్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 195 పెరిగి రూ. 27,125కు చేరింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 250 పెరిగి 37,300కు చేరింది. ఆభరణాల తయారీదారుల నుంచి కొత్తగా కొనుగోళ్లకు డిమాండ్ వచ్చినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.2 డాలర్లు పెరిగి 1,188.04 డాలర్లకు, ఔన్సు వెండి ధర 0.5 శాతం పెరిగి 16.21 డాలర్లకు పెరిగాయి. దేశవాళీ మార్కెట్లో ఆభరణాల బంగారం ధర (99.5 శాతం ప్యూరిటీ) పది గ్రాములు రూ. 26,975కు పెరిగింది.

  • Loading...

More Telugu News