: ఏపీ నేతల ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఆధారాలు
ఉమ్మడి రాజధానిలో 'ఫోన్ ట్యాపింగ్'పై సేకరించిన ఆధారాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఏపీ ప్రభుత్వం సమర్పించనుంది. ఏపీకి చెందిన నేతల ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపిస్తున్న ప్రభుత్వం, తమ వద్ద వున్న ఎవిడెన్స్ ను కేంద్రానికి అందించే దిశగా, ఏపీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావును ఇప్పటికే ఢిల్లీ పంపింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో వీరిద్దరూ కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసి ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ సేకరించిన ఆధారాలను అందజేయనున్నారు. హైదరాబాదులో శాంతిభద్రతల అంశంపై విభజన చట్టంలో పొందుపరిచిన సెక్షన్ -8 ను అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని వారు కోరనున్నట్టు తెలుస్తోంది.