: సంతాపసభలో కూడా రాజకీయ విమర్శలు చేయబోయిన వైకాపా ఎంపీ... ఇతర నేతల అభ్యంతరం
అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయ విమర్శలకు దిగడం నేతలకు అలవాటయిపోయింది. సందర్భాలు కూడా మరచిపోయి విమర్శలు చేస్తుండటం వారికి అలవాటే. తాజాగా ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మాజీ మంత్రి పెంచలయ్య సంతాపసభలో వైకాపా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ, ఎప్పట్లాగానే నోటికి పని కల్పించబోయారు. సముద్రాలు ఈది మురుగుకాల్వలో పడినట్టు కేసీఆర్ చేతిలో చంద్రబాబు ఇరుక్కుపోయారని ఆయన అన్నారు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యేలు సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్ లు మేకపాటి వ్యాఖ్యలపై వెంటనే అభ్యంతరం తెలిపారు. సంతాప సభలో రాజకీయాలు మాట్లాడరాదంటూ సూచించారు. దీంతో, మేకపాటి తన రాజకీయ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అనంతరం సంతాపసభ సజావుగా కొనసాగింది.