: గవర్నర్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: భట్టి


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నడుస్తున్న రాజకీయ వివాదం రాజ్యాంగ వివాదంగా మారుతున్నా గవర్నర్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఇద్దరు సీఎంలు రెండు రాష్ట్రాలను దోచుకుంటున్నారని ఆ పార్టీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ఈ సమయంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ రాజ్యాంగ పరిరక్షణను గాలికొదిలేశారని భట్టి వ్యాఖ్యానించారు. ఇలాగే ఉంటే ఆయనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ను గ్రేటర్ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. జీహెచ్ఎంసీలో అసంబద్ధంగా వార్డుల విభజన జరిగిందని ఫిర్యాదు చేయనున్నారు.

  • Loading...

More Telugu News