: మంత్రి ఈటెలను పరామర్శించిన దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పరామర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన ఇంటికి వెళ్లిన దత్తాత్రేయ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా మాజీ సీఎం కిరణ్ కుమార్ కుమార్ రెడ్డి నిన్న (బుధవారం) ఈటెలను ఫోన్ లో పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారట. కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈటెల గాయపడిన విషయం తెలిసిందే. రేపు ఆయన కాలికి శస్త్ర చికిత్స చేయనున్నారు. ఇందుకోసం నేడు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరతారు.