: జయలలిత ఒక్కరోజు ఉప ఎన్నిక ప్రచారం
చెన్నయ్ లోని రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 27న జరగనున్న ఉపఎన్నికకు ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఈ నెల 22న ఆర్ కే నగర్ లో జయ ప్రచారం చేయనున్నారు. ఈ ఒక్కరోజు కార్యక్రమంలో పలు ప్రాంతాల్లో జయ ప్రచారం చేస్తారని, రెండు పబ్లిక్ ర్యాలీల్లో ప్రసంగిస్తారని అన్నాడీఎంకే పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఉపఎన్నికను తమిళనాడులోని అన్ని పార్టీలు బాయ్ కాట్ చేయగా, సీపీఐ ఒక్కటే పోటీకి దిగుతోంది. పార్టీ సీనియర్ నేత సీ.మహేంద్రన్ ను అభ్యర్థిగా పోటీ చేయిస్తోంది.