: బొత్సకు షాక్... ఆయన ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు
ఇటీవలే వైకాపా తీర్థం పుచ్చుకున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. విజయనగరం జిల్లాలోని గరివిడిలో బొత్స కబ్జా చేసిన స్థలాలను పోలీసు బందోబస్తుతో అధికారులు తొలగిస్తున్నారు. స్థానికంగా బొత్స గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఆర్ అండ్ బీ స్థలంలో... బొత్స చేసిన ఆక్రమణలను తొలగించే పనిలో అధికారులు పడ్డారు. ఈ క్రమంలో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్రమణలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు, పోలీసులను వైకాపా కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.