: వెంకయ్యతో కేటీఆర్ భేటీ... తాజా పరిణామాలపై చర్చ
తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీలు, తాగు నీటి ప్రాజెక్టులపై ఆయన వెంకయ్యనాయుడితో చర్చించినట్లు సమాచారం. అయితే ఓటుకు నోటు వ్యవహారంపై తెలుగు రాష్ట్రాలు కత్తులు దూసుకుంటున్న నేపథ్యంలో వెంకయ్యతో కేటీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పలు అభివృద్ధి పనులపై వీరి మధ్య చర్చలు జరిగినా, ఓటుకు నోటుపైనే ప్రధాన చర్చ నడిచినట్లు తెలుస్తోంది.