: రూ. 22 కోట్లు కట్టండి... ఏపీ సచివాలయానికి జీహెచ్ఎంసీ నోటీసులు


పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. రూ. 22 కోట్ల మేరకు ఏపీ సెక్రటేరియేట్ బకాయి పడిందని, దీన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ, గురువారం ఉదయం నోటీసులు పంపింది. కాగా, ఓటుకు నోటు వ్యవహారం తరువాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు బెడిసి కొడుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ నోటీసులు పంపడం గమనార్హం. కాగా, ఉమ్మడి ఆస్తుల్లో భాగంగా హైదరాబాదులో పలు భవనాలను అటు తెలంగాణ, ఇటు ఏపీ సర్కారు సంయుక్తంగా వినియోగించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీకి దాదాపు ఈ భవనాలన్నీ కోట్ల రూపాయలు బకాయి పడ్డవే. ఇప్పుడు ఏపీ వాటా కింద చెల్లించాల్సిన మొత్తాన్ని డిమాండ్ చేస్తూ, నోటీసులు పంపేందుకు గ్రేటర్ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News