: ఇండియాలో ఎమర్జెన్సీ వచ్చినా రావచ్చు: బీజేపీ కురువృద్ధుడి అంచనా


భారతీయ జనతా పార్టీ పాలన సాగుతున్న వేళ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. భవిష్యత్తులో ఎమర్జెన్సీ తరహా వాతావరణం ఇండియాలో ఏర్పడవచ్చని ఆయన అంచనా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో అద్వానీ సంబంధాలు అంత బలంగా లేవని ఆ పార్టీ నేతలే స్వయంగా అంగీకరిస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశంలో ఎమర్జెన్సీ విధించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఓ పత్రికకు అద్వానీ ఇంటర్వ్యూ ఇచ్చారు. 1975 నాటి అత్యయిక పరిస్థితి వాతావరణం, రాజకీయ వ్యవస్థ ఇంకా రాలేదని, అయితే, భవిష్యత్తులో రాబోదని తాను చెప్పలేకపోతున్నానని అన్నారు. ఇండియాలో పౌర స్వేచ్ఛకు భంగం కలగబోదన్న నమ్మకం తనకు కలిగేలా పాలన జరగడం లేదని ఆయన అన్నారు. అయితే, అత్యవసర పరిస్థితి రావడం, ఎమర్జెన్సీ విధింపు అంత సులువేమీ కాదని అద్వానీ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News