: అమెరికా కాన్సులేట్ లో సాంకేతిక లోపం... హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా నిలిచిన వీసా జారీ ప్రక్రియ
ఢిల్లీలోని అమెరికా కాన్సులేట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, వీసాల జారీ ప్రక్రియతో పాటు, పలు కార్యకలాపాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఈ సాంకేతిక సమస్యతో దేశంలో ఉన్న హైదరాబాద్, ముంబై, కోల్ కతా, చెన్నై కాన్సులేట్ లలో కూడా సేవలన్నింటికీ విఘాతం కలిగింది. వీసా ఇంటర్వ్యూలను కూడా ఆపేశారు. 22వ తేదీ నుంచి నుంచి 26 వరకు తీసుకున్న వీసా అపాయింట్ మెంట్స్ ను తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని అమెరికన్ ఎంబసీ అధికారులు తెలిపారు. వీసా జారీ ప్రక్రియ ఆగిపోవడంతో... వీసాల కోసం కాన్సులేట్లకు చేరుకున్న వారు నానా ఇబ్బందులు పడుతున్నారు.