: రూ. 13 వేలకు 'క్రోమ్ బుక్' ల్యాప్ టాప్
గూగుల్ ఆధారిత క్రోమ్ ఆపరేటింగ్ వ్యవస్థపై పనిచేసే ల్యాప్ టాప్ ను ఈ-కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ లో అందుబాటులో ఉంచినట్టు క్సోలో వెల్లడించింది. క్రోమ్ బుక్ పేరిట లభించే దీని ఖరీదు రూ. 12,999 అని సంస్థ ప్రకటించింది. 11.6 అంగుళాల డిస్ ప్లే, 1.8 గిగాహెర్జ్ వేగంతో పనిచేసే రాక్ చిప్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జిబి రామ్, హెచ్డీ వెబ్ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణని తెలిపింది. రెండు యూఎస్ బీ పోర్టులు, ఎస్ డీ కార్డు, హెచ్ డీఎంఐ, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఉందని, ఒకసారి చార్జింగ్ తో 10 గంటల పాటు ల్యాప్ టాప్ ను వాడుకోవచ్చని ప్రకటించింది. గూగుల్ డ్రైవ్ లో 100 గిగాబైట్ల స్టోరేజిని రెండు సంవత్సరాల పాటు ఉచితంగా వాడుకోవచ్చని తెలిపింది. గూగుల్ ఐడీతో లాగిన్ అయి క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాప్స్ వినియోగించుకోవచ్చని వివరించింది. కాగా, క్రోమ్ బుక్ ధరపై స్నాప్ డీల్ కొంత డిస్కౌంటును కూడా ఇస్తుండడం గమనార్హం.