: బైరెడ్డి ఇలాకాలో పాశవిక హత్య...రాళ్లతో కొట్టి యువకుడిని చంపేసిన దుండగులు
ఫ్యాక్షన్ హత్యలకు కేంద్రంగా మారిన కర్నూలు జిల్లాలో నిన్న రాత్రి పాశవిక హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని రాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా హతమార్చారు. జిల్లాలోని నందికొట్కూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ మాజీ నేత, రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇలాకాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, హంతకులెవరన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.