: ఐఎస్ఐఎస్ దాడులు పొంచి ఉన్నాయి... జాగ్రత్త: రాష్ట్రాలకు ఐబీ హెచ్చరిక


ఐఎస్ఐఎస్ దాడులు పొంచి ఉన్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో రాష్ట్రాలను హెచ్చరించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఐఎస్ఐఎస్ దాడులపై రాష్ట్రాలకు ఐబీ హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి కావడంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదుతో పాటు ముంబై, కోల్ కతా, బెంగళూరు, చెన్నై నగరాల్లో విరుచుకుపడేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పథకాలు రచిస్తున్నారన్న సమాచారం మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఐబీ అప్రమత్తం చేసింది. ఈ రాష్ట్రాల్లో దాడులకు దిగేందుకు దాదాపు 35 మంది ఉగ్రవాదులు సన్నాహాలు చేస్తున్నారని తెలిపింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఆయా నగరాల్లోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News