: కడప జిల్లాలో ఎంపీడీఓ ఆత్మహత్యాయత్నం...కలెక్టర్, ఆర్డీఓల వేధింపులే కారణమని ఆరోపణ


కడప జిల్లా అధికార వర్గాల్లో నేటి ఉదయం కలకలం రేగింది. జిల్లాలోని లింగాల మండలం ఎంపీడీఓగా పనిచేస్తున్న మురళీమోహన్ ఆత్మహత్యాయత్నం చేశారు. వారం రోజుల క్రితం సస్పెన్షన్ వేటుపడ్డ ఆయన గత రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే కుటుంబ సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓల వేధింపులు తాళలేకనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన ఆరోపిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News