: ముంబయి క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా మరోసారి శరద్ పవార్ ఎన్నిక
ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడిగా రాజకీయవేత్త శరద్ పవార్ మరోసారి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఆయన తిరుగులేని విజయం సాధించారు. పద్నాలుగేళ్లుగా ఎంసీఏను పాలిస్తున్న ఈ ఎన్సీపీ అధినేత తాజా ఎన్నికల్లోనూ పట్టు నిరూపించుకున్నారు. పవార్ కు 172 ఓట్లు పోలవగా, ఆయన ప్రత్యర్థి, ఎంసీఏ ఉపాధ్యక్షుడు విజయ్ పాటిల్ కు 145 ఓట్లు పోలయ్యాయి. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం యజమాని అయిన విజయ్ పాటిల్ గత నాలుగేళ్లుగా ఎంసీఏతో కొనసాగుతున్నారు. ఇక, ఉపాధ్యక్షులుగా భారత్ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్, ఆశిష్ షేల్కర్ ఎన్నికయ్యారు.