: ఆ వికెట్ తీసినందుకు భారత ఫ్యాన్స్ ఇప్పటికీ నన్ను క్షమించలేదు: మెక్ గ్రాత్


ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ 2003 వరల్డ్ కప్ ఫైనల్ సంగతులను నెమరువేసుకున్నాడు. ఆ ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఆసీస్ జట్లు తలపడగా, లక్ష్యఛేదన ఆరంభంలోనే క్రికెట్ దేవుడు సచిన్ వికెట్ తీయడం ద్వారా మెక్ గ్రాత్ టీమిండియా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. తాజాగా, హార్డీస్ వైన్ ప్రచారకర్తగా ఓ క్రికెట్ వెబ్ సైట్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు మెక్ గ్రాత్. టైటిల్ సమరంలో సచిన్ వికెట్ తీసినందుకు భారతీయులు ఇప్పటికీ తనను క్షమించలేదని తెలిపాడు. ఆ మ్యాచ్ లో 4 పరుగులు చేసిన సచిన్ తొలి ఓవర్లోనే మెక్ గ్రాత్ కు వికెట్ అప్పగించాడు. "సచిన్ తో ఎన్నోసార్లు తలపడ్డాను. మా ఇద్దరి మధ్యా గొప్ప పోరాటాలు నడిచాయి. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో సచిన్ వికెట్ తీసినందుకు మాత్రం భారత ఫ్యాన్స్ నన్నిప్పటికీ క్షమించలేదు.ఆ మ్యాచ్ లో ఓ షార్ట్ బంతితో సచిన్ పనిబట్టాను" అని వివరించాడు.

  • Loading...

More Telugu News