: ఫోన్ ట్యాపింగ్ పై ఓ చానల్ కు, ఓ ఐపీఎస్ అధికారికి నోటీసులు ఇస్తాం: ప్రత్తిపాటి


ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానికి స్పష్టమైన ఆధారాలున్నాయని ఏపీ మంత్రులు అంటున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ పై ఓ వార్తా చానల్ కు, ఓ ఐపీఎస్ అధికారికి నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. మొత్తం వ్యవహారంపై తమ పోలీసు యంత్రాంగం చర్యలు ప్రారంభిస్తోందని తెలిపారు. ఫోన్ ట్యాప్ చేయలేదని ఏసీబీ డీజీపీగానీ, తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులుగానీ చెప్పలేదని గుర్తు చేశారు. చట్ట పరిధిలో ఏం చేయాలో అదే చేస్తున్నామని, చట్టానికి లోబడే వ్యవహరిస్తున్నామని వివరించారు. ఇక, మంత్రి రావెల మాట్లాడుతూ... గవర్నర్ కు విశేష అధికారాలిచ్చింది ఉభయ రాష్ట్రాల మధ్య సఖ్యత కోసమేనని స్పష్టం చేశారు. ఎన్నో అంశాల్లో తాము ఫిర్యాదు చేసినా గవర్నర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News