: విశేషాధికారాలు, హక్కుల కోసమే చంద్రబాబు ప్రయత్నం: ప్రొఫెసర్ కోదండరాం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్షన్-8 అమలుకు పట్టుబడుతుండడంపై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. హైదరాబాదుపై విశేషాధికారాలు, హక్కుల కోసమే చంద్రబాబు ప్రయత్నమని దుయ్యబట్టారు. సెక్షన్-8పై ఏపీ సర్కారు చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం ఆమోదించరాదని అన్నారు. గవర్నర్ ను లక్ష్యంగా చేసుకుని నేతలు వ్యాఖ్యలు చేయడాన్ని కోదండరాం తప్పుబట్టారు. శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేలా ఏపీ పాలకుల వైఖరి ఉందని విమర్శించారు. ఏడాది కాలంగా ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారని స్పష్టం చేశారు.