: నరేంద్రమోదీ పేరుతో మొబైల్ యాప్... విడుదల చేసిన ప్రధాని


ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరుతో మొబైల్ యాప్ వచ్చేసింది. ఆ పేరుతో రూపొందించిన యాప్ ను ప్రధానే స్వయంగా విడుదల చేశారు. "నరేంద్రమోదీ మొబైల్ యాప్'ను ప్రారంభించాను. రండి, మొబైల్ లో నాతో కనెక్ట్ అవ్వండి" అని మోదీ ట్వీట్ చేశారు. తన పేరుపై వచ్చిన మొబైల్ యాప్ లో పలు సరికొత్త ఫీచర్లు ఉన్నాయని, ఆ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. ట్విట్టర్ లో ఎప్పుడూ చురుగ్గా ఉండే ప్రధాని తాజా మొబైల్ యాప్ తో ప్రజలకు మరింత చేరువ కానునున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆయన ఈ యాప్ ను విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా తాజా సమాచారంతో పాటు ఆయన నుంచి సందేశాలు, ఈమెయిల్స్ అందుతాయి. అంతేగాక యాప్ ద్వారా మోదీతో ఆలోచనలు పంచుకోవడంతో బాటు, సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉంది.

  • Loading...

More Telugu News